ట్రంప్ ఇమిగ్రేషన్ నిర్ణయం ఓ సంచలనం..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ నిర్ణయం కారణంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? అమెరికా పౌరుల ఉద్యోగులకు రక్షణగా తాత్కాలికంగా వలసలు నిలిపి వేస్తూ మాత్రమే నిర్ణయం తీసుకున్నారా? కరోనా మహామ్మారి వ్యాప్తి కారణంగా
అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు రావడంతో 22 మిలియన్స్ అమెరికన్లు నిరుద్యోగులు అయ్యారు. అంతే కాకుండా కోవిడ్-19 వైరస్ వాషింగ్టన్ రాష్ట్రంలో మొదలై అత్యధికంగా US దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలో ప్రభావం చూపడంతో ఫైనాన్స్ వ్యవహారాలు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో, విభాగాల్లో ప్రభావం పడింది.

అసలు విషయాలు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం చేసి బయటకు వచ్చాకే ఎలాంటి కేటగిరీలు ఉంటాయో తెలుస్తుంది.

కొన్ని దేశాల్ ముస్లింలను రాకుండా ట్రావెల్ బ్యాన్, అమెరికా పొరుల హక్కులు లక్ష్యమని గతంలో కూడా ట్రంప్ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకుని వచ్చారని వాషింగ్టన్ డిసి మెట్రోలో ఇమిగ్రేషన్ లా అటార్నీగా ప్రాక్టీస్ చేస్తున్నా జనేతా కంచర్ల చెబుతున్నారు.