తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కమలం పార్టీ అధిష్టానం నియమించింది. RSS మూలాలు, యువతలో ఫాలోయింగ్ ఉండటం 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడంతో బీజేపీ సంజయ్ బాలపరుస్తూ ఎంపిక చేసింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్ తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి రావడానికి ప్రజలే కారణం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. కేవలం బీజేపీలో మాత్రమే సామాన్య కార్యకర్తలు ఈ స్థాయి వరకు ఎదుగుతారు.
పార్టీని సమిష్టి నిర్ణయాలతో అందరిని కలుపుకొని ముందుకు నడిపిస్తాను. తెలంగాణ రాష్ట్రము రావటానికి కృషి చేసింది యువకులు అలాగే నా గెలుపుకు కారణం కుడా యువకులే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం.
పార్టీలో అమిత్ షా కంటే సీనియర్లు కూడా ఉన్నారు, కానీ ఆయన నాయకత్వంలో పార్టీ ముందుకు నడిపించారు.
అందరూ పార్టీ కోసం పని చేయాల్సింది ప్రతి ఒక్కరు బూతు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు సహకరించాలి.

*తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడు బండి సంజయ్*

బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్.

పేరు: బండి సంజయ్ కుమార్పు DOB తేదీ:11-7-1971

తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.మతము: హిందువు. కులము: మున్నూరుకాపు,(బి.సి-‘డి’) భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని). పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్

ప్రస్తుత బాధ్యత:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు

గతంలో చేపట్టిన బాధ్యతలు:

–బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..

–అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..

–ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999;1999-2003) డైరెక్టర్ గా..

–బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్ గా

–భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.

–శ్రీ ఎల్.కె అద్వానీ గారు చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా..

–కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా,రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.

— వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా.

–2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు.

–2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా,రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు.

–2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేసి,టీఆరెస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.

2020 బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం.