ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, షా లతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసిన కొత్తగా ఎంపికైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హోం మంత్రి కిషన్ రెడ్డి మరియు బిజెపి తెలంగాణ ఎంపీలు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన బండి సంజయ్ మరియు తెలంగాణ బీజేపీ నేత బృందం.

బిజేపికి రాష్ట్రంలో మంచి భవిష్యత్ ఉంది
కష్టపడి పని చేస్తే అధికారం మనదే
రాష్ట్ర నూతన అధ్యక్షులు బండి సంజయ్ తో
అమిత్ షా వ్యాఖ్య

తెలంగాణ లో భారతీయ జనతా పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని బిజేపి మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,బిజేపి రాష్ట్ర నూతన అధ్యక్షులు బండి సంజయ్ తో వ్యాఖ్యానించారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన బండి సంజయ్ గురువారం పార్లమెంట్ లోని కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అమిత్ షా, బిజేపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో బిజేపి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మరింతగా కష్టపడాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని చెప్పారు. పార్టీ శ్రేణుల్లో నూతనుత్సాహం కన్పిస్తోందని, ఆ దిశలోనే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టంగా మార్చాలని తెలిపారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా పోరాడాలని చెప్పారు. కేంద్ర పథకాల నిధుల్ని పక్కదారి పట్టిస్తోన్న తీరును రాష్ట్ర ప్రజలకు వివరించాలని ఆదేశించారు. పోలీసుల అక్రమ కేసులు, ప్రభుత్వ దాడులకు భయపడవద్దన్నారు.

ఆదివారం హైదరాబాద్ కు బండి సంజయ్
బిజేపి రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ ఆదివారం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం పార్టీ శ్రేణులు నిర్వహించనున్న ర్యాలీ లో పాల్గొననున్నారు.