తెలంగాణ బడ్జెట్-2020 ఆదివారమే

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు-ఆదివారమే బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ 5వ సమావేశాల నిర్వహణపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన స్పీకర్ గారి ఛాంబర్ లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC ) సమావేశం.

హాజరైన సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యులు టి‌. హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈటేల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వినయ్ భాస్కర్, గొంగడి సునీత, భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీ మరియు శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు.

ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేది వరకు జరపాలని సమావేశం నిర్ణయం. 9, 10, 15 తేదీలలో సెలవులను మినహాయిస్తే మొత్తం శాసనసభ బడ్జెట్ సమావేశాలు 12 రోజులు జరుగుతాయి.

సమావేశంలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ సమావేశాల పనిదినాలను పొడిగించాలని కోరగా సభా నాయకుడు శ్రీ కేసీఆర్ గారు మాట్లాడుతూ శాసనసభ వర్కింగ్ డేస్ పై బడ్జెట్ సమావేశాల సమయంలో మరోసారి BAC సమావేశం జరిపి నిర్ణయం తీసుకుందామని అన్నారు. నిర్మాణాత్మక చర్చలు జరిగితే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులైనా జరపడానికి సిద్దమని తెలిపిన సభా నాయకుడు శ్రీ కేసీఆర్ గారు.

CAA, NRC లకు వ్యతిరేకంగా సభలో ప్రభుత్వమే తీర్మానం చేస్తుందని ముఖ్యమంత్రి గారు సమావేశంలో తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ పై ప్రజలలో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను తొలగించడానికి శాసనసభలో చర్చించాలని నిర్ణయించిన BAC. రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. దీనిని దూరం చేయడానికి శాసనసభ లో చర్చించి ప్రకటన చేయాలని సభ్యుల అంగీకారం.

304, లఘు ప్రశ్నలపై చర్చించడానికి ముఖ్యమంత్రి గారు అంగీకారం. ప్రతిపక్ష సభ్యులు కోరితే ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధం, కొంచెం ముందస్తుగా ఆయా అంశాలను అందిస్తే అవసరమైన సమాచారాన్ని ఆయా శాఖల ద్వారా తెప్పించి సభలో అందుబాటులో ఉంచుతామని తెలిపిన సభా నాయకుడు.

శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ భానుప్రసాద్, అసెంబ్లీ విప్ గువ్వల బాలరాజు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలపై మీడియాతో మాట్లాడారు.

BAC సమావేశంలో కాంగ్రెస్ భట్టి విక్రమార్క, MIM అక్బరుద్దీన్ ఒవైసి పాల్గోన్నారు. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చిస్తాం. ఎల్లుండి ఆదివారం రాష్ట్ర సర్కారు బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. హోలీ సందర్భంగా సోమ, మంగళవారం
సెలవులు. మార్చి 13 నుంచి 19 వరకు పద్దులపై చర్చలుంటాయి. మార్చి 20 ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ద్రవ్య వినిమియ బిల్లు పై సమాధానం ఇవ్వనున్నారు.
అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క స్వల్ప కాలిక చర్చలు పెట్టాలని
కోరడంతో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మరోసారి BAC తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలానే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
శాసన మండలిలో 13,14 వ తేదిన స్వల్ప కాలిక చర్చలుంటాయి. మొత్తం 8 రోజులు మండలి సమావేశాలు జరగనుండగా శాసన సభ మాత్రం 12 రోజులు నిర్వహించనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా CAA, NRC అలాగే NPRలపై కేసీఆర్ సర్కార్ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.