పోలీసులు సమన్వయంతో పనిచేయాలి: తెలంగాణ రాష్ట్ర డీజీపీ.

పోలీసులు సమన్వయంతో పనిచేయాలి: మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ.

పోలీసులు అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ
నేరాలను నియంత్రించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ DGP మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం హన్మకోండ సుబేదారిలోని ఆర్ట్స్
కాలేజీ మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. అనంతరం అక్కడి నుండి కాజీపేటలోని నిట్
కళాశాలలోని సమావేశ మందిరానికి చేరుకుని వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో
ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో ముందుగా పోలీస్ కమీషనర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు అదుపు
చేయడానికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పద్దతి వివరించారు. అనంతరం
అధికారులను ఉద్దేశిస్తూ డీజీపీ మాట్లాడారు. నేర నియంత్రణకు పోలీసులు కృషి చేయాలన్నారు. ప్రతి
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలపై పోలీస్ అధికారులు
తక్షణమే స్పందించాల్సి వుంటుందని, తగురీతిలో అధికారులు నమోదయిన కేసుల విచారణ చేపట్టి నేరస్థులకు
శిక్ష పడడంలో ఎటువంటి రాజీలేకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా పోలీస్ శాఖ కీర్తి
ప్రతిష్ఠలు ఆధారపడి వుంటాయని, రాబోవు రోజుల్లో పోలీస్ అధికారులు ఇతర శాఖలతో మరింత సమన్వయంతో
పనిచేయాల్సి వుంటుందన్నారు.

మనపై ప్రజలకు వున్నా నమ్మకాన్ని పెంచాలి కానీ తగ్గించుకోవద్దని, ప్రజల పూర్తి స్థాయిలో రక్షణకై పోలీస్ వ్యవస్థ
ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా ప్రజలు నచ్చే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మనపై వుందని,
ఇదే విధంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు మనపై గౌవరం పెరుగుతుందని, పోలీసులు ప్రజలు, ఇతర
ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే అధికారులు,
సిబ్బందిలో నాయకత్వం లక్షణాలను పెంపొందించే విధంగా వారిలో అవగాహన కల్పించాల్సి తెలిపారు.

మావోయిస్టుల అంశంపై డీజీపీ ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టల కదలికలపై నిఘా
కోనసాగించడంతో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా వున్న రాష్ట్రాల సరిహద్దుల వెంట ముమ్మర తనిఖీలు
నిర్వహించాలని, యాక్షన్ టీంలను కట్టడిలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా వాహన తనీఖీలు,
కార్డన్సర్లు, నాఖబంది నిర్వహించడంతో ముందుస్తు సమాచారము సేకరించాల్సి వుంటుందని, ముఖ్యంగా
పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించే హోంగార్డుల
నుండి స్టేషన్ అధికారి వరకు మావోయిస్టు వ్యవస్థ పూర్తి స్థాయిలో అవగాహన కలిగివుండాలని డీజీపీ తెలపడంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల పనితీరు బాగుందని డీజీపీ కితాబునిచ్చారు.

ఈ సమావేశంలో ఐజీలు నాగిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ కరీంనగర్, రామగుండం కమినషనర్లు
డా. వి.రవీందర్, కమాలహసన్ రెడ్డి, సత్యనారయణ, ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ లో పాటు
అదనపు డిసిపిలు, ఎ.సి.పిలు ఇన్స్పెక్టర్లు,
ఆర్.ఐలు సబ్ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.