టీఎస్ హైకోర్టు సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

టీఎస్ హైకోర్టు సబ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

2012 ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్ కో విభాగంలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన TRS ప్రభుత్వం 2015లో గత ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రద్దుపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 2015లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ట్రాన్స్ కో విభాగం సబ్ ఇంజినీర్ల కు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నిర్ణయంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో 380 మంది సబ్ ఇంజినీర్ల నియామకానికి లైన్ క్లియర్ అయినట్టైంది.