కరోనా దెబ్బకు తిరుమల వెంకన్న దర్శనం బంద్..

భక్తులకు టిటిడి శ్రీవారి దర్శనం నిలిపివేత

కరోనా నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవాళ మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాదు.. నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే.. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. కాగా.. రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తామని ప్రకటించింది.

తిరుమల సందర్శించిన ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన దయా శంకర్‌ భక్తునికి కరోనా వైరస్ పరిక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో
దయా శంకరుతో పాటు మరో 109 మంది భక్తులకు ఉపసమనం కలిగింది. టిటిడి అధికారులు భక్తుల పట్ల అలసత్వం వహించారని సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రప్రచారం చేయడంపై కేసు పెట్టనున్న టిటిడి.