నమో వెంకటేశా నమో తిరుమలేశా..

తిరుమల కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర ఆల‌యంలో పూజలు శాస్త్రోక్తంగా యధావిధిగా జరుగుతున్నాయి.
కరోనా ప్రభావంతో భక్తులకు అనుమతి లేనప్పటికీ ఆలయంలో మూల విరాట్ విగ్రహంకు అలాగే ప్రత్యేక రోజుల్లో పూజలు ఖచ్చితంగా పద్ధతి ప్రకారం పూజారులు చేస్తున్నారు.
శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై వసంతోత్సవం, శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో
శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు సేవలు, పూజలు కనుల పండుగగా జరిగాయి.

శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవాల్లో స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
TTD బోర్డు చైర్మన్ YV సుబ్బారెడ్డి, TTD EO AK సింఘాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నిత్య ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతారయం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అపోహలు నమ్మరాదని విజ్ఞప్తి చేసారు.