టీయూడబ్ల్యూజే ఢిల్లీ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29, 2020ః
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఢిల్లీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఇక్కడ జరిగిన యూనియన్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా లెంకల ప్రవీణ్ కుమార్(సాక్షి), ప్రధాన కార్యదర్శిగా బోడపట్ల ప్రదీప్ కుమార్(టీవీ5), కోశాధికారిగా కె.శిరీష్ రెడ్డి(హెచ్ఎంటీవీ) ఎన్నికయ్యారు. కమిటీకి గౌరవ సలహాదారుగా ఎ.కృష్ణారావు(ఆంధ్రజ్యోతి) వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షులుగా స్వరూప పొట్లపల్లి (ఆంధ్రప్రభ), కిరణ్ కుమార్ దండు(బీబీసీ), అశోక్ రెడ్డి ఉండ్యాల (వీ6), కార్యదర్శులగా గోపీకృష్ణ మేక (10టీవీ), ఆచార్య శరత్ చంద్ర (జీ హిందూస్థాన్ ), లింగారెడ్డి (టీ న్యూస్) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా హరికృష్ణ పులుగు (జీ హిందూస్థాన్), ఎన్.పవన్‌రెడ్డి (జీ హిందూస్థాన్), వంగా తిరుపతి (వెలుగు), ఎం.రవీందర్ రెడ్డి (ఆంధ్రజ్యోతి), సాగర్ కుమార్ వనపర్తి (నవ తెలంగాణ), ఎం.శ్రీనివాస్ రెడ్డి(ఏబీఎన్), రాజేందర్ పిల్లి (జీ హిందూస్థాన్), బి.నాగరాజు(వీ6) ఎన్నికయ్యారు. ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్‌గా డి.విజయ్ కుమార్(ఈనాడు), ఢిల్లీ తరపున రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా వెంకటేష్ నాగిళ్ల (సాక్షి టీవీ) వ్యవహరిస్తారు.