చిక్కుల్లో పండిన ఇండోనేషియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు 

చిక్కుల్లో పండిన ఇండోనేషియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు 

కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఎంతగా మొత్తుకుంటున్నా, కొందరు వినే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా యువతులైతే, తమ అందానికి అడ్డుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదే ఆలోచనతో ఉన్నఇండోనేషియాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వినూత్నంగా ఆలోచించారు గానీ, ఆపై చిక్కుల్లో పడ్డారు.మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలీలో ఉంటున్న జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు అమ్మాయిలు, మాస్క్ కు బదులుగా, తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో మాస్క్ లు వేసుకుని ఓ సూపర్ మార్కెట్ కు వచ్చారు. ఆపై వీడియోలు తీసుకున్నారు. దీన్ని చూసిన వారు అది మాస్క్ కాదని, పెయింటింగ్ అని పలువురు గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో ఇండోనేషియా అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.