కోవిడ్‌19 రెండు కొత్త లక్షణాలు. తస్మాత్ జాగ్రత్త

కరోనా లక్షణాలు పరిశీలిస్తే ఆయాసం, అలసట, గొంతు మంట, జలుబు, దగ్గు, తల నొప్పి, జ్వరం వచ్చినట్లయితే కోవిడ్19 వైరస్‌ సోకిందని అనుమానం వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు ప్రకటించింది. అంతే కాకుండా కరోనా సోకిన వ్యక్తుల్లో ఈ లక్షణాలు బయట పడడానికి రెండు రోజుల నుంచి 14 రోజుల వరకు పట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రపంచమంతా అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోతోంది. ఐతే ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన వైద్యులు రెండు కొత్త లక్షణాలను కనుగొన్నారు. కోవిడ్‌ వైరస్‌ సోకిన వ్యక్తులకు అన్నింటికన్నా ముందుగా వాసనను గుర్తించలేరని, తర్వాత రుచిని కూడా కోల్పోతారని లండన్‌కు చెందిన ఈఎన్‌టీ వైద్యులు గుర్తించారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులు అనుకోకుండా వాసనను పసిగట్టే సామర్థ్యం కోల్పోయామని చెప్పగా, ఈ కారణం తెలుసుకున్నామని బ్రిటన్‌లోని ఈఎన్‌టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ తెలిపారు.