మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్ధవ్ కాదు.. శరద్ పవార్: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాటిల్

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్ధవ్ కాదు.. శరద్ పవార్: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాటిల్

మహారాష్ట్ర సర్కారును నడుపుతున్నది ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కాదని, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ విమర్శించారు. శరద్ పవార్‌ను కలిస్తేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమవుతాయి తప్పితే, ఉద్ధవ్‌ను కలిస్తే కావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే గవర్నర్‌ను కలిశారు. దీంతో శరద్ పవార్‌ను కలవాలని గవర్నర్ కోష్యారీ ఆయనకు సలహా ఇచ్చిన నేపథ్యంలో చంద్రకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్‌ థాకరేకు గవర్నర్ ఏం చెప్పారన్న విషయాన్ని పక్కనపెడితే తనకు తెలిసినంత వరకు రాష్ట్రాన్ని ఏలుతున్నది శరద్ పవారేనని చెబుతానని పాటిల్ తేల్చి చెప్పారు. గత 9 నెలల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి తాను బోల్డన్ని లేఖలు రాసినా ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని అన్నారు.