ఉగాది పండుగ ప్రత్యేకతలు/కరోనా కట్టడి

ఉగాది పండుగ ప్రత్యేకతలు/కరోనా కట్టడి

ఉగాది అచ్చ తెలుగు పండుగ. ఉగాది నాడే తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలసుకొని గ్రహశాంతుల
కోసం పంచాగ శ్రవణాన్ని వినడం ఆనవాయితీ. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణ పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దిన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.బ్రహ్మ దేవుడు గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను ఈనాడు ప్రవర్తింప జేసారనేది వాడుకలోనుంది. వసంత ఋతువు కాలం ఆరంభమయ్యేది కొత్త జీవితానికి నాందిగా తరతరాలుగా భావిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ సంబరంగా నిర్వహిస్తారు కానీ 2020లో కరోనా కారణంగా దేశమంతటా కర్ఫ్యూ కొనసాగుతోంది. అందుకే దేశ మంతటా లాక్ డౌన్ ఉంది కాబట్టి మనం కూడా పూజలు పునస్కారాలు 2020లో మాత్రం ఇంట్లోనే కానిచ్చేద్దాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ పచ్చడి జీవిత గమనంకు ప్రతీక. జీవితం అన్ని రుచులను చవిచూస్తుంది అనేందుకు పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలుస్తోంది.