అకాల వర్షాలు- రైతన్నల కన్నీళ్లు

తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు తీరని కడగండ్లను మిగిల్చాయి. ఈ అత్యవసర మరియు ఆర్థిక ఇబ్బందుల్లో తెలంగాణ సర్కారు రైతుల సంకేమం కోసం ముందుంటుందని మంత్రి హారీష్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని కొమురవెళ్లి, కొండపాక, నంగునూరు మండలాల్లోని పొలాల్లో మంత్రి హరీశ్ పర్యటించారు. వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేసారు.