యూఎస్‌ ఓపెన్‌ వాయిదా!

యూఎస్‌ ఓపెన్‌ వాయిదా!

కరోనా దెబ్బకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేస్తున్నామంటూ ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్‌ ఓపెన్‌ కూడా వాయిదా పడేట్లు కనబడుతోంది.
యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరగాల్సి ఉంది. అప్పటికి కరోనా తగ్గుముఖం పట్టినా యూఎస్‌ ఓపెన్‌ జరుగుతుందా? కారణం ఫ్రెంచ్‌ ఓపెన్‌ వాయిదా పడటమే. ఇప్పటికే మేలో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను నిర్వాహకులు సెప్టెంబర్‌ 20కు వాయిదా వేశారు.