కరోనాలో అర్జెంట్ ఇన్సెపెక్షన్

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆక‌స్మిక త‌నిఖీ చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. గిర్ని తండ చెక్క పోస్టుని ప‌రిశీలించి, అక్క‌డ ఉన్న పోలీసులతో మాట్లాడారు.

లాక్ డౌన్ ని ప్ర‌జ‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వేర్వేరు ప్రాంతాల నుంచి ప్ర‌యాణిస్తున్న వాళ్ళ‌ని ఎక్క‌డిక్క‌డే ఉండేట్ల చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వాహ‌నాల‌ను త‌నిఖీ చేసి, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లాక్ డౌన్ కి విఘాతం క‌లిగే చ‌ర్య‌ల‌ను పూర్తిగా అడ్డుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు.

ప్ర‌జ‌ల్లో కొంద‌రు ఇష్టానుసారంగా తిరుగుతుండ‌టం, అవ‌న‌స‌ర ప్ర‌యాణాలు, అంద‌రితో క‌లుస్తుండ‌టం వ‌ల్లే క‌రో్నా వైర‌స్ విస్త‌రిస్తున్న‌ద‌న, ప్ర‌స్తుతం కంట్రోల్ లోకి వ‌స్త‌న్న క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే లాక్ డౌన్ ఇలాగే కొన‌సాగించాల‌ని, ఒక‌వేల లాక్ డౌన్ పాటించ‌క‌పోతే, మ‌రికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించ‌కోవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌న్నారు. మంత్రి వెంట‌ పాలకుర్తి సిఐ రమేష్ నాయక్, గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ త‌దిత‌రులు ఉన్నారు.