అమెరికన్లకు ఆకలి దప్పులు తీర్చేదెవరు???

అమెరికన్లు అన్నామో రామచంద్ర అంటూ అల్లలాడుతురున్నారు. ఓవైపు కరోనా విజృంభన మరోవైవు నిరుద్యోగం, కనీసం చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు 4అడుగుల జాగ కరువు, ఇప్పుడేమో ఏకంగా జానడెంత పొట్ట ఆకలి తీర్చేందుకు కిలో మీటర్లు క్యూలు కార్లలో దర్శనమిస్తున్నాయి. మన దేశం కంటే భూభాగంలో, ఆర్థికంగా, అత్యాధునికంగా అభివృద్ధి చెందిన అమెరికన్లు 35కోట్లు జనాభా ఉంటే భారత ఖండంలో 130కోట్లు పైమాటే కానీ మనం శరణార్థులు, నిరుపేదలు, ఆహార అవసరం ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరికి గడప గడపకు ఆహార పానీయాలు, సరుకులు అందిస్తున్నాం మరీ USA పౌరులు పస్తులుంటున్నారు.

టెక్సాక్ లో శాన్ ఆంటోనియా నగరంలో జాలి దయతో ఎవరైనా ఏదైనా ఇచ్చేవాళ్లే కరువయ్యారు/ దేశమంతా ప్రభుత్వంకు 66లక్షల మంది నిరుద్యోగ భృతి దరఖాస్తు కోరారంటే దీనస్థితి అర్థమవుతోంది.

అప్పట్లో USAలో విద్యుత్ కోతలు రావడంతో మన భారత దేశ రెస్టారెంట్లు అమెరికన్లకు ఉచితంగా ఆహార సదుపాయాలు అందించాం ఇప్పుడు 2020లో మన ఇండియన్లే USA సిటీజన్లకు కడుపు నింపుతున్నారు. మెరా భారత్ మహాన్/అన్నపూర్ణ నా భారత దేశం/ఎవడు పేదవాడు అమెకానా ఇండియానా ఎంత ధనమున్నా ఆపదకు అక్కరకు రాని జనం/ కనీసం కనికరం చూపలేని దౌర్భాగ్యం/మనసు లేని మనుషులు/ప్రేమ,దయ, జాలీ, అభిమానం లేకుండా ధనానికే ప్రాధాన్యత/నోట్లు తింటారా? గుట్టకేసుకుని పోతారా/ ప్రపంచానికే ఔనత్యాన్ని, ఆకలి తీర్చే అన్నదాత సుఖీభవ పద్ధతులను నేర్పుతున్నాం మనం భారతీయులం మేమేనని గర్వంగా చెప్పుకునే కరోనా రోజులివి. ఏడు ఖండాల్లోని దేశాలు భారతదేశంలో ఐక్యమత్యం/ఆదరణ/అభిమానాలు/సహాయం/నిబద్ధత వైపు కళ్లు బిగ్గరగా చేసుకుని చూస్తూ ఆశ్చర్య పోతున్నాయి.

*ఇదంతా ప్రజల గొప్పతనం భారతీయుల్లారా సెల్యూట్*..