అమెరికా డిజాస్టర్ డిక్లరేషన్ – చరిత్రలో తొలిసారి!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ వల్ల అమెరికాలో ఇప్పటికే 20 వేలపైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌లోని రాష్ట్రాలు ఒక్కోటిగా డిజాస్టర్ డిక్లరేషన్ చేస్తున్నాయి. దీని ప్రకారం, ఈ విపత్కర పరిస్థితుల్లో ఫెడరల్ నిధులను ఆయా స్థానిక ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు.

తాజాగా వ్యోమింగ్‌లో డిజాస్టర్ డిక్లరేషన్ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో యూఎస్‌లోని మొత్తం 50 స్టేట్స్‌లో డిజాస్టర్ డిక్లరేషన్ చేసినట్లయింది. ఇలా 50 స్టేట్స్‌లో ఈ ప్రకటన చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. ఈ చర్యలు కరోనా తీవ్రతను చాటి చెప్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 5.3 లక్షలమందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 20 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు.