చరిత్రలో కిలికితురాయి మొతెరా స్టేడియం.
ప్రపంచంలోనే No1 బాహుబలి స్టేడియంగా మొతెరా క్రికెట్ స్టేడియం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాకతో జనంతో కిక్కిరిసిపోయింది.
ఈ స్టేడియాన్ని ప్రారంభించి లక్షా 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియంలోని జనంతో ఇరు దేశాల అగ్రనేతలు మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను సభకు పరిచయం చేసిన వెంటనే ప్రధాని మోదీ ‘నమస్తే ట్రంప్’ సభను ప్రారంభించారు.
USA, భారత్ జాతీయా గీతాలాపన అనంతరం ‘భారత్ మాతాకీ జై’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించి భారత్-అమెరికా స్నేహం కలకాలం విలసిల్లాలని కొనియాడారు.
చరిత్రలో అహ్మదాబాద్ పుటలు నెమరు వేస్తే భారత స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ నదికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, భారత్ అమెరికాలను కలుపుతుంది. స్టాచ్యు ఆఫ్ లిబర్టీ – స్టాచ్యూ ఆఫ్ పటేల్ మధ్య సంబంధముంది. ఇరు దేశాల స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడాలి. డోనాల్డ్
ట్రంప్ రాకతో అభివృద్ధి, సౌభ్రాతృత్వానికి బాటలు వేయనున్నాయని ప్రధాని అభిప్రాయబడ్డారు.