NRI డాక్టరుకు USA సెల్యూట్

USAలో భారతీయ వైద్యురాలికి ఘనమైన గౌరవం దక్కింది. అమెరికాలో డాక్టర్లు కరోనా మహామ్మారి సోకిన వ్యక్తులకు ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు.

USలోని సౌత్ విన్సడ‌ర్ ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న భార‌త సంతతికి చెందిన మైసూర్‌ నివాసురాలు డాక్టర్‌ ఉమా మ‌ధుసూద‌న చేస్తున్న వైద్య సేవలకు అమెరికా అధికారులు ఆమె ఇంటి ముందు ప్రభుత్వ వాహనాలతో భారీ పరేడ్‌ నిర్వహించి సెల్యూట్ చేసారు.

వాహనాల్లో నుంచే అధికారులు, భారతీయ NRIs, అమెరికన్లు ఆ మహిళను అభినందించారు. ప్రతిగా డాక్టర్‌ ఉమా మధుసూదన అందరికి ధన్యవాదాలు తెలిపారు.