న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో ఇచ్చిన ప్రకటన నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది. ఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రకటన ద్వారా ప్రవాసాంధ్రులకు సీఎం వైయస్.జగన్ గారి సందేశాన్ని తెలియజేశాను. తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఒక మంచి ప్రయత్నం పై దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. ధర్నాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేసింది గత టిడిపి ప్రభుత్వం. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. టైమ్స్ స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నార్త్ అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ కోరారు.
కరోనా వ్యాప్తి నియంత్రణ, నివారణ కోసం ఏపి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టిడి చేసేందుకు వైరస్ సోకిన వారిని గుర్తించడం మొదలు, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రజల నిత్యావసరాలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధ చర్యలను తీసుకుంటోంది. మరోవైపు అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులకు మన రాష్ట్రంలోని వారి కుటుంబాల బాగోగుల పట్ల ఆందోళన చెందకూడదన్నదే ముఖ్యమంత్రి వైయస్.జగన్ నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రభుత్వం వారికి తోడుగా ఉందని ధైర్యం చెప్పేందుకు నిండు మనసుతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రకటన ద్వారా ప్రవాసాంధ్రులకు సీఎం శ్రీ వైయస్.జగన్ గారి సందేశాన్ని తెలియజేశాను. ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేశాను. తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఒక మంచి ప్రయత్నం పై దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. టైమ్స్ స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోంది. ధర్నాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేసింది గత టిడిపి ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. సొంత మనుషులకు, అనుకూల మీడియాకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది చంద్రబాబు ఆయనకున్న పబ్లిసిటీ పిచ్చి ప్రజలకు తెలిసిందే అందుకే మీ 5 యేళ్ల దోపిడీపై విసుగుచెందిన ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఎలాంటి ఆధారాల్లేకుండా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టాను, సందేహం ఉన్నవారు మందుకొస్తే నివృత్తి చేస్తాను ఈ విషయంలో ప్రభుత్వంపై విష ప్రచారానికి పూనుకున్నవారిపై చట్టప్రకారం ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్–19 రెగ్యులేషన్, 2020, విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద శిక్షార్హులని పండుగాయల రత్నాకర్, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అన్నారు.