మెరుపులా దూసుకెళ్తాడు శ్రీనివాసుడు

ఉసేన్ బోల్ట్ అంతకు మించి దూసుకెళ్తాడు మనోడు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాడు. ఉసేన్‌ బోల్డ్‌ను ‘అంతకు మించి’ మెరువు వేగంతో దూసుకెళ్లే కర్ణాటకలోని
28 ఏళ్ల శ్రీనివాస గౌడ ఇప్పుడు ప్రపంచాన్నే ఆకర్షిస్తున్నాడు.
ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన ఈ అద్భుతమైన అథ్లెట్ విషయం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు పరిశీలనకు వెళ్లింది. అంతేకాదు త్వరలోనే శ్రీనివాస గౌడకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) నుంచి ఆహ్వానం అందనుంది. కేంద్ర క్రీడల మంత్రే స్వయంగా శ్రీనివాస గౌడకు కాల్‌ చేసి సాయ్‌ నిర్వహించే ట్రయల్‌కు రమ్మని పిలుస్తానని పేర్కొన్నారు.

‘నేను శ్రీనివాస గౌడను సాయ్‌ ట్రయల్స్‌కు రమ్మని పిలుస్తాను. అథ్లెట్స్ చాలామందికి ఒలింపిక్స్‌ స్టాండర్స్‌ గురించి సరైన అవగాహన లేదు. ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం. దాంతోనే ఎన్నో ఘనతలు సాధ్యం. భారత్‌లో టాలెంట్‌ అనేది నిరూపయోగంగా ఉండకూడదు’ అని మంత్రి అభిప్రాయబడ్డారు.