గుండెపోటుతో ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిర హఠాన్మరణం

గుండెపోటుతో ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిర హఠాన్మరణం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నాయకురాలు ఇందిర హృదయేశ్ నిన్న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. శనివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన ఇందిర ఆ తర్వాతి రోజు అక్కడే కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇందిర కరోనా బారినపడ్డారు. కోలుకున్న అనంతరం గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇందిర అంత్యక్రియలు నేడు ఆమె స్వస్థలమైన హల్ద్వానీలో నిర్వహించనున్నట్టు కుమారుడు సుమిత్ తెలిపారు. ఇందిర మృతికి ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీ, ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.