త్వరలో అందుబాటులోకి డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

త్వరలో అందుబాటులోకి డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు

 

అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్‌ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియ జవాబిస్తూ ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. వాక్సిన్‌ నిపుణుల ఆమోదం, సిఫార్సుల అనంతరం ఈ రెండు వాక్సిన్లను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.