23 కోట్ల డ్రైవర్లకు శుభవార్త

కాలపరిమితి తీరిన డ్రైవింగ్ లైసెన్సులు మరియు వాహన నమోదులు జూన్ 30 వరకు పొడింగింపు. వాహన యోగ్యత, రహదారి అనుమతులు, డ్రైవింగ్ లైసెన్స్, నమోదు మరియు వాహనాలకు సంబంధించి ఇతర పత్రాల కాలపరిమితి కూడా ఇందులో చేర్చబడింది. ఫిబ్రవరి 1 నుండి కాలపరిమితి చెల్లిన వాహన యోగ్యత, రహదారి అనుమతులు, డ్రైవింగ్ లైసెన్స్, నమోదు మరియు వాహనాలకు సంబంధించి ఇతర పత్రాల కాలపరిమితిని రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ పొడిగించింది. అటువంటి పత్రాలను జూన్ 30 వరకు కాలపరిమితి కలిగినవిగా వ్యవహరించవలసినదిగా అన్ని రాష్ట్రాలను మరియు కేంద్రపాలిత ప్రాంతాలను మంత్రిత్వ శాఖ కోరింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ రవాణా కార్యాలయాల మూసివేత వలన ఆయా వాహన పత్రాలను పునరుద్ధరించుకొను ప్రకియలో ప్రజలకు కలుగు అసౌకర్యాన్ని తొలగించుటకు రవాణా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మోటారు వాహన నిబంధనల క్రిందకు వచ్చే అన్ని రకాల వాహన యోగ్యత, రవాణా అనుమతులు, డ్రైవింగ్ లైసెన్సులు, నమోదు పత్రాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని “లెటర్ అండ్ స్పిరిట్” క్రింద అమలు చేయాలని కేంద్రం కోరింది, ఫలితంగా అత్యవసర సేవలు నిర్వహిస్తున్న ప్రజలు, రవాణాదారులు, రవాణా సంస్థలు ఎటువంటి కష్టనష్టాలకు గురికాకుండా ఉంటారని తెలిపింది.