భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ‘వాలిమై’

భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ‘వాలిమై’

అజిత్ హీరోగా ఎచ్.వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ రూపొందుతోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తూ ఉండగా, కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల కోసం అజిత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ‘దీపావళి’ కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది.తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను వాళ్లంతా ఎంతగానో ఇష్టపడతారు. ‘వాలిమై’ యాక్షన్ థ్రిల్లర్ కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కొంతకాలంగా అజిత్ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఇక హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ నటిస్తుండటంతో, తెలుగు ప్రేక్షకుల్లోను ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.