ఢిల్లీలో చమురు ధరలపై వ్యాట్ పెంపు

ఢిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్‌ను 27% నుండి 30%కి ఢిల్లీ ప్రభుత్వం పెంచింది. డీజిల్‌పై 16.75% నుండి 30% వరకు పెంచిన ఢిల్లీ ప్రభుత్వం. పెట్రోల్ ధర రూ .1.67, డీజిల్ రూ .7.10 పెంపు భారం పడనుంది. ఓ వైపు ప్రపంచ మార్కెటులో చమురు ధరలు పాతాళానికి పడిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చమురు సంస్థలు ఉంటే మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలో ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ వడ్డనతో సామాన్య మానవుల నడ్డి విరుస్తున్నాయి.