జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేశ్ 

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేశ్ 

గతంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త పంథాలో సాగుతూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.వెంకటేశ్, మీనా జంటగా నటించిన ఆ సినిమా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్. ఇప్పుడు మలయాళంలో ‘దృశ్యం 2’ కూడా వచ్చింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ క్రమంలో వెంకటేశ్ ‘దృశ్యం 2’ని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గతంలో తెలుగులో ‘దృశ్యం’కు ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తే.. ఇప్పుడీ సీక్వెల్ కు మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగును ఈ రోజు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్ దీనిని నిర్మిస్తోంది.