వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య విరాళం.

కేంద్ర ప్రభుత్వం COVID-19 వ్యాప్తిని ఎదుర్కోనేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధికి ఓ నెల జీతం విరాళంగా ఇచ్చారు. అలాగే కరోనా కట్టడికి ప్రజలందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికలు, సూచనలు, నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. కరోనా సోకకుండా ప్రజలందరూ ఇంట్లో ఉండండి- సురక్షితంగా ఉంటారు అని పిలుపునిచ్చారు.