విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి వినూత్నంగా ‘లైగర్’ అని పేరు పెడుతూ, ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ను ఉదయం 10 గంటలకు వెల్లడించిన యూనిట్, ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని ఉప శీర్షిక పెట్టారు. కాగా, లైగర్ అంటే, మగ సింహం, ఆడ పులికి పుట్టే సంతతి. ఇవి మామూలు సింహం, పులికన్నా పెద్దగా ఉండటంతో పాటు సింహాల్లా గర్జిస్తాయి.ఇక ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ పై విజయ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. పూరితో పాటు చార్మి, కరణ్ జొహార్ లు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, ఇది క్రేజీ ప్రాజెక్టుగా మారింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫ్లాప్ కావడంతో, తదుపరి సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విజయ్ దేవరకొండ, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించాడని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతోంది.