సీవీఎల్ కు మద్దతు ప్రకటించిన విజయశాంతి

సీవీఎల్ కు మద్దతు ప్రకటించిన విజయశాంతి

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సెప్టెంబ‌రులో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ఉత్కంఠ నెల‌కొంది. తెలంగాణ, ఆంధ్ర కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ఎన్నిక‌ల్లో తాను కూడా పోటీ చేస్తాన‌ని సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్‌ నరసింహారావు.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అసోసియేష‌న్‌లో ఇకపై తెలంగాణ, ఆంధ్ర అని రెండు విభాగాలు ఉండాలని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల సినీన‌టి విజ‌య‌శాంతి స్పందిస్తూ ఆయ‌న అభిప్రాయానికి మ‌ద్ద‌తు ప‌లికారు.’మా ఎన్నికలపై సీవీఎల్‌ నరసింహారావు ఆవేదన న్యాయమైంది, ధర్మమైంది. నేను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్ట్యా సీవీఎల్‌ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా’ అని విజయశాంతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సారి మా అధ్య‌క్ష బ‌రిలో ఏకంగా ఐదుగురు బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.