పంచాయితీల్లో కరోనాపై సోడియం హైపోక్లోరేట్‌

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నిరోధానికి కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆయా రాష్ట్రాల పంచాయతీల స్థాయిలో పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్రాలవారీగా సదరు చర్యలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్‌: అన్ని పంచాయతీల్లోనూ వివిధ మాధ్యమాల
ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపు, క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యకలాపాలు, సోడియం హైపోక్లోరేట్‌ చల్లడం. వ్యక్తిగత రక్షణకు మాస్కుల పంపిణీ, రేషన్‌ సరకులు, పశుగ్రాసం, పంపిణీ వగైరా…

బీహార్‌: భారత-నేపాల్‌ సరిహద్దు సమీపంలోని సింఘ్వానీ గ్రామ సర్పంచ్‌ అన్ని రకాలుగానూ అందరికీ ఆదర్శప్రాయంగా పనిచేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌: సామాజిక దూరం పాటింపుపై అవగాహన కల్పన, పంచాయతీరాజ్‌ అధికారులద్వారా వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులకు హస్త పరిశుభ్రతపై చైతన్యం పెంపు.

తమిళనాడు: పంచాయతీల్లోని గ్రామాల్లో రేషన్‌ సరకులు తీసుకునే సమయంలో సామాజిక దూరం నిబంధనను తూచా తప్పకుండా పాటిస్తున్న గ్రామస్థులు. రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, ఇంటి ముంగిటకు కూరగాయల సరఫరా, ఆరోగ్య-పారిశుధ్య సిబ్బందికి మూడురకాల వ్యక్తిగత రక్షణ సామగ్రి పంపిణీ.

ఒడిషా: కటక్‌, భువనేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల పరిధిలోని పంచాయతీల్లో నిరాశ్రయులకు ఆహారం సరఫరా, ఆహార భద్రత సాయం కింద లబ్ధిదారులకు రూ.1,000 వంతున పంపిణీ, గ్రామాల్లో అగ్నిమాపక సిబ్బందిద్వారా రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం, సామాజిక దూరం పాటింపుపై అవగాహన కల్పన.

తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో అవగాహన పెంపు సమావేశాలు, సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీ సభ్యులు, పురపాలక చైర్‌పర్సన్లు, తహసీల్దార్లు తదితరులకు కోవిడ్‌-19 విధివిధానాలపై శిక్షణ. స్వయంగా మాస్కులు తయారుచేసి పంపిణీ చేసిన శంకర్‌పల్లి మండల చైర్‌పర్సన్‌.

మహారాష్ట్ర: మహారాష్ట్ర నుంచి డోర్నకల్‌లోని తమ నివాసాలకు వెళ్తున్న వలస కార్మికులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారిని సహాయ శిబిరాలకు తరలించి ఆశ్రయం కల్పించి ఆహారం, నీరు తదితరాలు అందజేశారు.

కర్ణాటక: జాతీయస్థాయి కన్నా ముందుగానే ఈ రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల జాలి పట్టణ పంచాయతీ దిగ్బంధాన్ని అమలు చేసింది. ఆ మేరకు సర్పంచ్‌ తమ పంచాయతీ సరిహద్దులను మూసివేయించడమేగాక సమీప పంచాయతీలను కూడా ఈ దిశగా ప్రోత్సహించారు.

లద్దాఖ్‌: కార్గిల్‌ జిల్లా పరిధిలోని అతిశీతల ప్రాంతంలోగల చౌకియాల్‌ పంచాయతీలో ఆహార పంపిణీ చేపట్టారు. దీంతోపాటు లద్దాఖ్‌లో ఆరోగ్య పరీక్షలు, క్వారంటైన్‌ సదుపాయాలు కూడా చేపట్టారు.

ఝార్ఖండ్‌: కోడెర్మా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది ఉచితంగా రేషన్‌ సరకులు పంపిణీ చేశారు.

కేరళ: అత్యవసర ప్రతిస్పందన కార్యకలాపాలకు వీలుగా ఎర్నాకుళం జిల్లాలోని వడకెక్కెర పంచాయతీ ఏకంగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

అండమాన్‌-నికోబార్‌ దీవులు: నిరుపేదలకు నిత్యావసరాలు, రేషన్‌ సరకులు, తాగునీరు తదితరాలను ఇంటింటికీ సరఫరా చేశారు. కొన్నికుటుంబాలకు నగదు సాయం అందించారు.

గోవా: ఉత్తర గోవాలోని సోనాల్‌ గ్రామవాసులు తమ గ్రామ ప్రవేశద్వారం వద్ద చెక్కగేటును అమర్చారు. ఇక్కడి యువకులు వంతులవారీగా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రజలకు బయటకు వెళ్లే అవసరం లేకుండా నిత్యావసరాల సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది.