చంద్రబాబుకు విశాఖ పర్యటనకు అనుమతి

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరగా ప్రభుత్వ హోంశాఖ అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.