దమ్మన్నపేట శ్రీమంతుడు: కేటీఆర్

దమ్మన్నపేట శ్రీమంతుడు: కేటీఆర్

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా తన సొంత గ్రామ అభివృద్ధికి ₹25 కోట్లు అందించిన వరంగల్ జిల్లా దమ్మనాపేటకు చెందిన కె.నర్సింహ రెడ్డితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు కేటీఆర్ తెలిపారు.
స్వచ్ఛందంగా గ్రామాలాభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు.

వరంగల్ జిల్లా దమ్మన్నపేట గ్రామ అభివృద్ధికి రూ.25 కోట్ల విరాళం నర్సింహా రెడ్డి ప్రకటించారు. వర్ధన్నపేట “శ్రీమంతుని”  ఔదార్యానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. న‌ర్సింహారెడ్డి ధాతృత్వం దేశానికే ఆద‌ర్శం, ఇది సీఎ గారి ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి ప‌ట్టమని మరో మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ అన్నారు. అందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రమేష్ సమక్షంలో రూ. 1.50 కోట్ల చెక్కును కేటీఆర్ కు అందచేసిన నర్సింహారెడ్డి.

పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి. ఆ మ‌ధ్య శ్రీ‌మంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అత‌ను మాత్రం త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో సంపాదించ‌డ‌మే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో రూ.25 కోట్లను విరాళంగా ప్ర‌క‌టించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయ‌ల చెక్కుని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ స‌మ‌క్షంలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, న‌గ‌ర పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కేటిఆర్ చేతులకు అంద‌చేశారు.

పూర్వ వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌మ్మ‌న్న‌పేట‌లో పుట్టి పెరిగిన కామిడి నర్సింహారెడ్డి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో స్థిరపడి బాగా సంపాదించారు. అయితే చాలా మందిలా త‌న పుట్టిన ఊరిని మ‌ర‌చిపోలేదు. త‌ను పుట్టిన ఊరుకు ఏదో చేయాల‌నే ఆలోచనతో ప‌ల్లెల‌ను స్వ‌యం స‌మృద్ధం చేయాల‌ని, ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌ముతో ఆద‌ర్శ
వంతంగా తీర్చిదిద్దాల‌ని సంక‌ల్పించిన సిఎం కెసిఆర్, ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి అతని వంతు సహాయం అందించారు. అసెంబ్లీలో ప‌ల్లె ప్ర‌గ‌తి పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్బంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగ ప్ర‌త్యేకంగా కామిడి న‌ర్సింహారెడ్డి ఔదార్యాన్ని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విరాళం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తపరిచారు.

కామిడి న‌ర్సింహారెడ్డి ధాతృత్వాన్ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, న‌గ‌ర పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ‌ల మంత్రి కేటిఆర్ ప్ర‌త్యేకంగా కొనియాడారు. ఉన్న ఊరుని, క‌న్న త‌ల్లిని మ‌ర‌వ‌ని వాళ్ళే నిజ‌మైన మ‌నిషి అన్నారు. కామిడి న‌ర్సింహారెడ్డి ఔదార్యం ప్ర‌పంచానికే ఆద‌ర్శ‌మ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కామిడి న‌ర్సింహారెడ్డిలాగా తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు, ఇత‌ర‌ *శ్రీ‌మంతులు* స‌హ‌క‌రించాల‌ని అన్నారు.