భారత్-పాకిస్థాన్ సైన్యం లాంచింగ్ ఫ్యాడ్స్ ధ్వంసం

ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పొరుగుదేశం దాయాది పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. మనదేశంలోకి ఉగ్రవాదులను ఎగదోసేందుకు కుట్రలను పన్నుతునే ఉంది. నేపాల్ నుంచి భారతదేశంలోకి 200 మంది కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను పంపించాలని కుట్రలు చేసినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చిరించారు. ఇప్పుడేమో సరిహద్దుల్లో అతిక్రమణలు చేసే ప్రయత్నాలు దీంతో భారత సైన్యం సరిహద్దుకు సమీపంలోన్న టెర్రర్ లాంచ్‌ ప్యాడ్లను టార్గెట్‌ చేసుకుంటూ కాల్పులు చేసింది.

భారత సైన్యం ఎంచుకున్న లక్ష్యాల్లో పాకిస్థాన్ లాంచ్ ప్యాడ్ ధ్వంసమైనదని, భారీ నష్టం వాటిల్లిందని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.