కరోనా కోరలు పీకాల్సిందే: సీఎం జగన్మోహన్

కోవిడ్‌19 నివారణా చర్యలపై సీఎం YS జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆళ్లనాని, బొత్స సత్యన్నారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు పరిశీలిస్తే డయాలసిస్‌ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని, కోవిడ్‌ ఆస్పత్రులుగా కొన్నింటిని ప్రకటించినందున అక్కడ అందించే సేవలను వేరే ఆస్పత్రులకు తరలించామన్నారు.

రోగులకు ఇబ్బంది రాకుండా ఉండడానికి వారికి అందాల్సిన సేవలను ఎక్కడకు మార్చామో వారికి సమాచారం ఇస్తున్నామని, దీనివల్ల ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు.

కర్నూలు, గుంటూరుల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై చర్చ

ఈ రెండు నగరాల్లో అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదని, వైరస్‌ ఒకటిరెండు ప్రాంతాలకే పరిమితమైందన్న ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని ఇక్కడ వైరస్‌ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సమావేశంలో సీఎం మార్గనిర్దేశం చేసారు. ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు ఉంచడంద్వారా కంటైన్‌ మెంట్‌ను పటిష్టంగా అమలు చేసేలా చూడాలన్నారు.

కుటుంబలో ఒకరికి పాసు ఇచ్చి, నిత్యావసరాలకు ఆవ్యక్తిని మాత్రమే వీధిలో అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వచ్చేలా చూడాలని, కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపైకూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని నిర్ణయించారు.

వైద్యం కోసం టెలిమెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందని, 8,395 మంది ఇప్పటివరకూ టెలిమెడిసిన్‌ ద్వారా డాక్టర్లను సంప్రదించారాని వివరాలు తెలిపారు. మందులు కూడా పంపిస్తున్నామని, APలో మరింత సమర్థవంతగా అమలు చేయాలని సీఎం అన్నారు.

డీఆర్డీఓ ద్వారా మొబైల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, వలస కూలీలు. వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని చర్చించారు. టమోటా, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులకు మార్కెటింగ్, ధరలపై దృష్టిపెట్టాలన్నారు. రైతు బజార్లను వీలైంత ఎక్కువగా వికేంద్రీకరించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఈ రైతుబజార్లకు అందుబాటులోకి తీసుకురావాలని CM ఆదేశించారు.