పౌష్టికాహారం పై విస్తృత అవగాహన కల్పించాలి’:నిజామాబాదు కలెక్టర్

పౌష్టికాహారం పై విస్తృత అవగాహన కల్పించాలి’:నిజామాబాదు కలెక్టర్

పోషణ మాసోత్సవాల పై మారుమూల ప్రాంతాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిజామాబాద్

జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పోషణ మాసోత్సవాలపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆరోగ్యంపై మారుమూల ప్రాంతాలలో అవగాహన కల్పించాలని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

అనంతరం పోషణ మాసోత్సవాల గోడపత్రిక ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు