BCCI/INDIAకు ఆ దౌర్భాగ్య దుస్థితి లేదు.

 

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అదొక యుద్ధమే. అలాగే క్రికెట్ అభిమానులు. మనదేశంలో మ్యాచ్ జరిగే తీరును పరిగణనలోకి తీసుకుంటారు. కానీ కరోనా విరాళాల కోసం దాయాదుల పోరు పెడదామంటే మాత్రం చెంప చెల్లుమనిపించారు తొలి ప్రపంచ వరల్డ్ కప్ సాధించి పెట్టిన సారధి కపిల్ దేవ్. భారత్- పాకిస్థాన్ మూడు వన్డేల సిరీస్‌ నిర్వహిస్తే వచ్చిన డబ్బును ఇరు దేశాలు కరోనా కట్టడికి విరాళంగా ఇవ్వాలని తన మనసులోని మాటను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షోయబ్ అక్తర్ చేత చెప్పించింది.

ఈ ప్రతిపాదనకు కపిల్‌దేవ్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. భారత్-పాక్ సిరీస్‌ల నిర్వహణతో వచ్చే డబ్బులు మా భారతదేశంకు అవసరం లేదు. మా దేశంలో అలాగే BCCIతో కావాల్సిన నిదుకున్నాయి. ఇప్పటికే కరోనా కట్టడికి బీసీసీఐ 51 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా మహామ్మారిని పారద్రోలేందుకు అవసరమైతే మళ్లీ మళ్ళీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. డబ్బుల కోసం క్రికెట్ ఆడాల్సిన దుస్థితి భారతదేశంకు లేదన్నారు.