సిగ్గుండాలి, చూడండి ఈ చిన్నారులను..

మానవుని సహజ లక్షణం వద్దన్న పనులే చేయడం. కరోనా కష్టాల్లో కనీసం ఒకే ఒక్క మాట వినండని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లబోదిబో కొట్టుకుంటున్నాను. కానీ జనాలు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. రోడ్లపై చక్కర్లు కొడుతూ అనవసరంగా ఎలాగంటే ఒకరికి టాటా ఉప్పు, మరొకరు ఆశీర్వాద్ గోధుమ పిండి, ఏకంగా పోలీసుల ఎదుటే ఓ ఆయనైతే విజయ పాల డైరీలో నెయ్యి కోసం వచ్చానని మొహమాటం లేకుండా చెబుతున్నారు, ఈ వస్తువులు నిజంగా ఏమైనా అత్యవసరాలా?? ఏమి లేకపోతే బతకలేమా?? అసలు మనిషి మనుగడకే అపాయం అంటుంటే మన చెవికి ఎందుకు ఎక్కదో ఏమో? అసలు సూక్ష్మ జీవితో యుద్ధంలో అత్యవసరం, ఎమెర్జెన్సీ అనే పదాలకు అర్థం తెలుసా?? అత్యసవసరం ఐతే అంటే వైద్య అవసరాలు, గుక్కెడు గంజీ కోసం నిత్యావసరాలు కొనాలంటే వారానికో రెండు వారాలకు ఒకే ఒక్కసారి బయటకు రండని చెబుతుంటే మన జనమేమో రోజు పరుగులు పెడుతున్నారు.. సరే తప్పదు అత్యవసరాల్లోనే బయటకు వచ్చారు కనీసం సామాజిక దూరం పాటించాలని చెవులకు చిల్లులు పడేలా చెబుతున్నారు కానీ మనకు మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది. ఏమాత్రం ఎక్కడం లేదు.

ఏమన్నా అంటే ఒకడంటాడు ప్రజాస్వామ్యంలో నాకు స్వేచ్ఛ ఉందని, మరొకడు నా ఇష్టం సస్తే నేనే కదా నీకెందుకని? ఏమైనా అన్నమే తింటూన్నమా మనం? లేక గాటికి కట్టేసిన అదేదో ఉందే విచేక్షణతో ఆలోచించలేని మూగ జీవాలమా? కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం లోకజ్ఞానం లేని చిన్నారులు పద్ధతిగా “Q”లో నీల్చుని మాస్కులు వేసుకుని, మార్గదర్శకాల ప్రకారం దూరం పాటిస్తూ ఆహారం కోసం నిల్చున్న ఫోటో చూసైనా కనీసం కొందరైన బుద్ధి తెచ్చుకోవాలి.

TRS రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రజలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. భవిష్యత్ తరాల కోసం కనీసం మనం అందరం నేడు కరోనా మార్గదర్శకాలు పాటించాలేమా ఆలోచించండని కోరారు.