కరోనా యుద్ధంలో ఆయుధాలు

హైదరాబాద్ నగరంలోని దుందిగల్ కి చెందిన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు కరోనా వ్యాధి నియత్రణ చర్యలలో భాగంగా 3D టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఫేస్ మాస్క్ లను గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందించారు.

మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల కార్యదర్శి, టీఆరెఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెటు ఇంచార్జి రాజశేఖర్ రెడ్డి 3D ఫేస్ మాస్క్ లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వారి వినూత్న ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరించకుండా తీసుకొనే చర్యలలో భాగంగా ఫేస్ మాస్క్ లు ఎంతగానో ఉపయోగ పడతాయని, ఆ దిశగా త్వరోలోనే నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

కోవిడ్19 నివారణ కొరకు మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యాసంస్థల ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా 3D లేజర్ టెక్నాలజీతో తయారు చేసిన యువీ (అల్ట్రావయొలెట్ డిసినిఫెక్షన్) ట్రాలీని రూపొందించి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావుకు అందచేశారు. ఈ సందర్భంగా ఈ పరికారం ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణంలోని కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు బ్యాక్టీరియా RNA అభివృద్ధి చెందకుండా పూర్తిగా నాశనం చేస్తాయని వారికి వివరించారు. ఈ పరికరాలు ఇంటి పరిసరాలు, ఆసుపత్రిల గదుల్లో దీనిని వాడేలా తయారుచేశారు. ఈ విన్నూతన ఆవిష్కరణను వాడుకలో తీసుకుంటామని మర్రి రాజశేఖర్ బృందంను ప్రశంసించారు.

గతంలో కూడా మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు తమ కళాశాల అధ్యాపకుల పర్యవేక్షణలో సమాజానికి ఉపయోగపడే విధంగా పలు ఆవిష్కరణలు చేశారని అందులో ముఖ్యంగా రైతులు తమ ట్రాక్టర్ల చోరిని నివారించడానికి” ఆటోమాటిక్ తెఫ్టు డిటెక్షన్ ఈక్విప్మెంట్టు” తయారుచేసి రైతాంగానికి మేలు చేశారని ప్రముఖ ట్రాక్టర్ తయారీ దిగ్గజం జాన్ డీర్ వారు వీటిని తమ ట్రాక్టర్ల తయారీలో వినియోగించే విధంగా పలు చర్యలు తీసుకున్నారని… అదేవిధంగా అంద విద్యార్థుల సౌకర్యార్థం voice to pen potter రూపొదించారు అని రైతులు తమ పంటను క్రిమి కీటకాలు సోకకుండా పలు పురుగుమందులు వాడుతుంటారు వాటిని పిచికారీ చేయడం చాలా కష్టం తో కూడుకున్న పని.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ కళాశాల విద్యార్థులు అధునాతన సాంకేతిక పరజ్ఞానంతో పరికరాన్ని రూపొందించిన విషయాలను మర్రి రాజశేఖర్ వివరించారు..