సోమవారం AP CM ఏమి చేశారంటే?

PM మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం ఎస్ జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా కట్టడికి అలాగే ఓరాజల సంక్షేమ అంశాలపై దృష్టి సారించారు.

1. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, భవిష్యత్‌ వ్యూహాలను చర్చించారు.

2. వీడియో కాన్ఫరెన్స్‌లో AP తరవున సీఎంతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు.

3. వీడియో కాన్ఫరెన్స్‌ ముగిశాక అధికారులతో సమావేశమైన సీఎం YS జగన్‌ అయ్యారు.

4. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్షించి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులు, పరీక్షల వివరాలను తెలుసుకున్నారు.

4. రైతు భరోసా కేంద్రాలపై అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులతో సమావేశం.

5 ఆర్‌బీకేల్లో ఏర్పాటుచేయనున్న కియోస్క్‌ పరిశీలన, ఫార్మర్‌ క్రెడిట్‌ కార్డు , డెబిట్‌ కార్డు అనేది తీసుకురాగలితే రైతులకు మరింత ప్రయోజనలపై చర్చ.

6. రైతులెవరూ నా డబ్బు నా చేతికి రాదు అన్న భయం ఉండకూడదు, సంబంధిత బ్యాంక్‌కు వెళ్ళి కార్డు చూపగానే డబ్బు రైతు చేతికిచ్చేలా ఉండాలి.

7. ఈ-క్రాప్‌కు లింక్‌ చేస్తూ క్రెడిట్‌ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బు డెబిట్‌ కార్డు ద్వారా రైతుకు అందాలి. కొత్త క్రెడిట్‌ కార్డులు ఇవ్వడంతోపాటు కొత్త అకౌంట్లు ఓపెన్‌ చేయాలి.

8. 56 లక్షల క్రెడిట్, 56 లక్షల డెబిట్‌ కార్డులు ఈ ఖరీఫ్‌కి సిద్దమవ్వాలి. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ జరిగితే మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలి.

9. 10,592 భవనాలను ఇప్పటికే గుర్తించారు, జూన్‌ 1 కల్లా అన్నీ సిద్దము చేయాలి. మొత్తం బిల్డింగ్‌లు రెడీగా ఉన్నాయా అని అధికారులను అడిగిన సీఎం? మౌలికసదుపాయాలు కూడా ఆర్బీకేలు ప్రారంభమయ్యేనాటికి ఏర్పాటుచేయాలని సూచించారు.

10. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది. పశు ఆరోగ్య సంరక్షణ కార్డు (యానిమల్‌ హెల్త్‌ కార్డ్‌) వివరాలు సీఎంకు వివరణ. రైతుభరోసా కేంద్రాల వద్ద పొలం బడి, పశు విజ్ఞాన బడి పేరుతో చేయనున్న కార్యక్రమాలను సీఎంకి వివరించారు.

11. ఆక్వారైతులకు నాణ్యమైన ఫీడు, సీడు అందాలి. రైతులకు ఏ విధంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేశారో ఆక్వా రైతులకు కూడా అదే విధంగా కాల్‌సెంటర్‌ ఉండాలి. ప్రతీచోటా ఆక్వా టెస్టింగ్‌ ఫెసిలిటీ ఉండాలి, సీడ్, సాయిల్‌ టెస్టింగ్‌ కిట్స్‌ సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కియోస్క్‌ ఏ రైతుకైనా నాలెడ్జ్‌ బ్యాంక్‌లా పనిచేస్తుందన్న అధికారులు

12. క్వాలిటీ సీడ్స్‌. కాలపరిమితి ముగిసిన విత్తనాలు ఎట్టి పరిస్ధితుల్లో అమ్మకూడదు. నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే రైతులకు ఇవ్వాలి. ఎట్టి పరిస్ధితుల్లో రైతు నష్టపోకూడదు. క్వాలిటీ టెస్టింగ్‌ ప్రాసెస్‌పై అధికారులను వివరాలు అడిగారు. తయారీదారు వద్ద కూడా క్వాలిటీ టెస్టింగ్‌ ఉండాలి

13. ఆర్‌బీకే హబ్స్‌ పనితీరును సీఎంకి ఆరా దీశారు. ప్రకృతి సేద్యంపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించిన సీఎం ప్రకృతి సేద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్‌బీకే యాండ్రాయిడ్‌ యాప్‌ వివరాలు సీఎంకి వివరించారు. ఈ యాప్‌లో సర్వీసెస్‌ (కాల్‌సెంటర్‌) కూడా ఉంచాలన్నారు.

14. ధాన్యం సేకరణ, మార్కెట్‌ ఇంటెలిజెన్స్,
ఈ-క్రాప్‌ నుంచి క్రాప్‌లోన్స్‌ లింకింగ్, ఈ క్రాప్‌తో మిగిలిన వాటిని కూడా లింక్‌ చేయాలి. మార్కెట్‌యార్డులను మరింత ఉపయోగకరంగా వాడుకునేందుకు అనుసరించాల్సిన అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జనతా బజార్లను కూడా మార్కెట్‌యార్డ్‌లతో కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా విత్తనాల కంపెనీల నుంచి కొనుగోళ్ళు జరగాలి.

15. జూన్‌1 కల్లా ఆర్‌బీకేలు సిద్దంగా ఉంటాయన్నారు. సేకరణ, మార్కెట్‌ ఇంటెలిజెన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్‌లు కూడా ఆర్‌బీకేకు లింక్‌ అవ్వాలి, అందుకవసరమైన మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలన్న సీఎం