కిటికీలో చేతులు ఇరుక్కున్నాయి..? ఎవరా ఆ హీరోయిన్?

హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠీకి గాయాలయ్యాయా? ఎలా?? అందమైన ముద్దుగుమ్మను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. చక్కని రూపం, ప్రేక్షలను ఇట్టే అకట్టుకునే అవినయం అంతకు మించి స‌మాజంపై ప్రేమ‌ లావణ్య త్రిపాఠీకి మాత్రమే సాధ్యం.

సరేలేండి అసలు విషయానికి వద్దాం. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కోనసాగుతుంది కాదా.. ఈ సమయంలో సినిమా పరిశ్రమలో షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అందుకోసం తోటి సినీ కార్మికుల‌ను ఆదుకునేందుకు త‌న వంతు బాధ్య‌త‌గా కరోనా క్రైసిస్‌ ఛారిటీకి రూ.ల‌క్ష విరాళం ఇచ్చిన తెలుగులో మొద‌టి హీరోయిన్‌ త్రీపాఠీ.

లావణ్య త్రిపాఠి ఇలా ఇంట్లోనే ఉండటం, రోజుల త‌ర‌బ‌డి రాలేని పరిస్థితులు వ‌స్తాయ‌ని అస‌లు ఊహించలేద‌ని అన్నారు. లాక్ డౌన్ సమయంలో తాను ఎక్కువ‌గా బ‌య‌ట తిర‌గ‌టం లేదని, అదేవిదంగా మాములు సమయంలో కూడా ఇంట్లో ఉండ‌టం, వంట చేయ‌డం ఇష్ట‌మ‌ని తెలిపారు. అందువ‌ల్లే ప్ర‌స్తుత లాక్ డౌన్ ప‌రిస్థితుల‌తో తాను ఇబ్బంది ప‌డ‌టం లేద‌ని చెప్పుకోచ్చారు. ప్రస్తుతం కరోనా ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి వీల్లేద‌ని చెప్పారామె.

లాక్‌ డౌన్‌ సమయంలో త‌న చేతి వేళ్లకు గాయమైందని, బలంగా, చాలా వేగంగా కిటికీ డోర్ వేశాన‌ని, మధ్యలోనే రెండు వేళ్లు ఇరుక్కున్నాయ‌ని లావణ్య తెలిపారు. ఐతే వేళ్లేమి విరగలేదు కానీ దెబ్బ గట్టిగా తగిలిన‌ట్టు వేద‌న‌తో అన్నారు. చాలా నోప్పిగా ఉన్నా ఇప్ప‌టికీ హాస్పటల్‌ పరిసరాలకు వెళ్లలేదని గమనించండి ఎంతో అత్యవసరం ఐతే తప్ప బయటకు వెళ్లవద్దని STAY HOME STAY SAFE అని విజ్ఞప్తి చేసారు.

లాక్‌డౌన్ కార‌ణంగా త‌న దైనందిక చర్యలు చాలా వరకు మారాయని వంట చేసుకోవడం, పుస్తకాలు చదవడం, ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్న‌, వేళ్లకు గాయం కావడంతో ఎక్కువసేపు వర్కవుట్స్‌ చేయలేకపోతున్న‌ట్టు ఆవేదన చెందారు.

లాక్ డౌన్ సమయంలో స్నేహితుల ద్వారా ‘మాస్టర్‌ క్లాస్‌’ అని ఒక యాప్ ని తెలుసుకున్న‌ట్టు లావ‌ణ్య వెల్ల‌డించారు. ఆ యాప్‌లో రచన, సినిమాలు, సంగీతం, రాజకీయాలు, కళలు, క్రీడలు., ప్రపంచంలోని ప్రతి రంగంలోని ప్రముఖులు అందులో క్లాసులు చెబుతుంటారని పేర్కోన్నారు. ప్ర‌స్తుతం వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న‌ట్టు లావ‌ణ్య త్రిపాఠీ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్నారు.