పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్రం ఏమంటోంది???
పెట్రోల్, డీజీల్ ధరలు 26.06.2010, 19.10.2014 నుంచి మార్కట్ నిర్ణీతంగా అమలులో ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి రాజ్యసభలో సోమవారం అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ద్వారా తెలిపారు. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) అంతర్జాతీయ ఉత్పత్తి ధరలు, ఎక్స్చేంజ్ రేట్లు, పన్ను వ్యవస్థ, అంతర్గత సరుకు రవాణా, తదితర వ్యయాంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్రోల్, డీజిల్ ధరలపై తగగిన నిర్ణయం తీసుకుంటున్నాయి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో ఆయా ఉత్పత్తుల ధరలతో లంకెను కలిగి ఉన్నాయి. కాగా, రాయితీతో కూడిన ఎల్పీజీ, పిడిఎస్ కిరోసిన్ రిటైల్ అమ్మకాల ధరలను అదుపు చేసి వినియోగదారులకు తగిన ధరలో అందించడాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి, వినియోగదారులకు ఊరట కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని 4 నవంబర్, 2021నుంచి వరుసగా లీటరుకు రూ. 5 & రూ.10 తగ్గించింది. తదనంతరం అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ (VAT)ను తగ్గించాయి.
గత మూడేళ్ళుగా పెట్రోలియం ఉత్పత్తుల వినిమయం ఆధారంగా ముడి చమురు, సహజవాయువుల స్వయం సమృద్ధి వివరాలు దిగువన ఇవ్వడం జరిగింది