కరోనాలో ఆరోగ్య మంత్రే దీక్షకు కారణం??

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో దీక్షకు కూర్చున్న ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి మల్లాడి అసంతృప్తి వ్యక్తం చేసారు.

గవర్నర్ నిర్ణయాలపై ప్రధాని, సీఎం, అసెంబ్లీ సెక్రెటరీకి ఫిర్యాదు చేసిన మంత్రి మల్లాడి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా, ఆసుపత్రికి పంపించకుండా మూడు రోజులపాటు చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేయడంపై మంత్రి మల్లాడి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 24 గంటల్లో క్వారంటైన్ కు తరలించక పోతే పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని నిన్న అల్టిమేటం ఇచ్చిన మంత్రి మల్లాడి, ఇవాళ పుదుచ్చేరి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టారు మంత్రి మల్లాడి కృష్ణారావు.