ఈ పాలిమర్స్ పరిశ్రమ ఏంటీ? ఏమి చేస్తుంది?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం RR వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకయ్యాయి. దీంతో మూణ్నాలుగు కిలోమీటర్ల మేర ఈ విష వాయువులు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వాయువు కారణంగా కళ్లు మండుతూ, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుండడంతో ప్రజలు ఉన్న ఫళంగా అక్కడి నుంచి దూరంగా తరలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళన నెలకొంది.

ఎల్జీ పాలిమర్స్ ఏమి చేస్తుంది?

ఈ కంపెనీ హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ప్రారంభమైంది. 1978లో దీన్ని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997లో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కంపెనీ టేకోవర్ చేసి ఎల్జీ పాలిమర్స్‌గా పేరు మార్చింది. పాలిస్టిరైన్, ఎక్స్‌పాండబుల్ పాలిస్టిరైన్ (థర్మాకోల్) వంటివి ఈ సంస్థలో తయారవుతాయి. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడంతో దీన్ని తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.