కరోనాలో సూర్యాపేట లోకల్ మంత్రేక్కడ??

సూర్యాపేటలో కరోనా కట్టడికి ఎందుకు స్థానిక మంత్రి జాగ్రత్తలు తీసుకోలేక పోయారు?? చేతకాక చేతులెత్తేసారా? ఆ స్థానిక మంత్రి ఎవరో? ఎందుకో తెలుసా? ఇగ ఈయనతో పని కాదని చీఫ్ సెక్రటరీ, DGP, ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో పంపాల్సి వచ్చింది.

స్థానిక మంత్రి జగదీష్ ఆయనను పక్కన పెట్టి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. చివరికి సమీక్షా సమావేశానికి కూడా మంత్రిని పిలవలేదు. ఇలా జరగడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు… మంత్రి తీరుతో సూర్యాపేట ప్రాంత ప్రజలకు కష్టాలు కన్నీళ్లే మిగిల్చాయి. ఆర్భాటం తప్ప పనిలేదు. చుట్టూ వేస్ట్ బ్యాచ్ వెంట వేసుకుని హంగామా చేయడం తప్ప మొదటి నుండి ప్రజలకు ఉపయోగపడే, సమర్ధవంతంగా ఒక్క పని చేసినది లేదని గుసగుసలు TRSలో వినపిస్తున్నాయి.