ఇండియాకు దక్కిన WHO కార్యనిర్వహక బోర్డు చైర్మన్ పదవి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థలో కీలక కార్య నిర్వాహక బోర్డు చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సంధర్బంగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కలసి శుభాకాంక్షలు తెలిపారు. 34 మంది సభ్యుల కార్య నిర్వాహక బోర్డు చైర్మన్‌గా భారత్‌కు అవకాశం ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్ష వర్ధన్ నియ‌మ‌కాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 194 స‌భ్య‌దేశాలు అంగీక‌రించాయి. శ్రీ హర్ష వర్ధన్ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. “కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే, బోర్డ్ చైర్మన్ గా, భారతదేశం తరపున, హర్షవర్ధన్‌ గారు ఎన్నికవ్వటం, మనందరికీ గర్వకారణం” అని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.