టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని WHO సూచన

టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని WHO సూచన

కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో భారత్ ను చూస్తే తెలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్ అన్నారు. భారత్ లో కేసుల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చాలా క్లిష్టపరిస్థితులున్నాయన్నారు. ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందన్నారు. వ్యాక్సినేషన్ పై భారత ప్రభుత్వం చర్యలు బాగున్నాయన్నారు. వైరస్ ఎంతటి వినాశనం సృష్టించగలదో భారత్ లోని పరిస్థితులే చెబుతున్నాయన్నారు. కరోనా టెస్టింగ్, పాజిటివ్ వచ్చినవాళ్లను కలిసిన వారి జాడ కనిపెట్టడం (ట్రేసింగ్), చికిత్స అందించడం (ట్రీటింగ్) వంటి పద్ధతులను అనుసరించాలని సూచించారు. టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు.