ఇటలీకి ఎందుకు ఈ గతి పట్టింది? పూర్తి వివరాలు మీకోసం.

ఇటలీకి ఎందుకు ఈ గతి పట్టింది? పూర్తి వివరాలు
మీకోసం.

కరోనా మరణాలతో ఇటలీ ఆక్రందనలతో తల్లడిల్లుతోంది.
ప్రపంచంలో అత్యాధునిక దేశం మౌళిక వసతులు, వైద్యరంగం సేవలు కలిగి ఉన్నప్పటికి అత్యధిక మరణాలు NO1 స్థానాన్ని పొందింది. మార్చి25th 2020వరకు 6,820 మంది మరణించగా 69,178 మంది వైరస్‌ సోకడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరప్ లోని ఇటలీలోనే ఎందుకు ఈ మృత్యుఘోష? ఎందుకు కారణాలేంటి?

నిర్లక్ష్యం, తప్పుడు సమాచారం..
ఇటలీ పాలకులు కరోనా ముప్పును తక్కువ చేసి చూపడం కారణంగానే వైరస్‌ వ్యాప్తికి కారణమైంది. వైరస్‌ మన వద్దకు రావడం సాధ్యం కాదు మనమే వైరస్ వద్దకు వెళ్లి కొరివి కొని తెచ్చుకుంటున్నాము. కరోనా కేసులన్నీ ఫ్లూ, జ్వరం లక్షణాలుగా పరిగణిస్తూ వైరస్‌ వ్యాప్తి చెందుతుంటే నిర్లక్ష్యంగా చూస్తూ కూర్చున్నారు. నియంత్రణ చర్యలకు తీలోదకలు పలికారు ఆలశ్యంగా మేల్కొని ఐసొలేట్‌ చేయడం, ప్రజల రాకపోకలను నియంత్రించడం, ఆంక్షలను కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వం కార్యాచరణ ఆరంభించింది.

ఇటలీలో 23శాతం వృద్ధుల జనాభా ఉండటం కూడా ఆ దేశానికి శాపంలా మారింది. ప్రపంచంలోనే వృద్ధుల జనాభా అత్యధికంగా కలిగిన దేశాల్లో ఇటలీ రెండో స్థానం. ఇటలీ జనాభాలో దాదాపు 23% మంది 65 ఏండ్లు అంతకు మించిన వయస్సు ఉన్న పౌరులు ఎక్కువ. వృద్ధులకు కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకరం. ఇటలీలో యువతకు వృద్ధులతో అనుబంధం ఎక్కువ. వారి ద్వారా వైరస్‌ వృద్ధులకు వ్యాపించడంతో ప్రాణనష్టం అత్యధికంగా నమోదవుతోంది.

భారతీయుల్లారా అర్థమైందా నిర్లక్ష్యం ఖరీదు ప్రాణాలు ఇటలీ దేశ మరణాలే మనకు నిదర్శనం, సాక్ష్యాలు. అక్కడ ఇటలీలో 6 కోట్ల జనాభా అంతే కానీ భారతదేశం 125 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో స్థానంలోన్నాము. ఇటలీ పాలకుల్లా మన దేశంలో అలసత్వం ప్రదర్శించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు, హెచ్చరికలు, లాక్ డౌన్, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రజలు అందరికి చేతులెత్తి దండంపెట్టి అడుక్కుంటున్నారు కానీ మనకు మన ప్రాణాలంటే కనికరం లేదు. ఎవరికి వారే నా దేశం ప్రజాస్వామ్య దేశం
నా ఇష్టం నాకు స్వేచ్ఛ ఉందని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాం. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనిపిస్తే కాల్చేస్తాం, మిలటరీని దించుతాం, లాక్ డౌన్, కర్ఫ్యూ తప్పదని హెచ్చరించేందుకు సిద్ధమయ్యాయి. ఓ భారతీయుడా కనీసం మీ ప్రాణాలకు మీరే విలువ ఇవ్వనపుడు ప్రభుత్వాలకు ఎందుకు పట్టింది. అందుకే 1897 చట్టం అమలు రోడ్లపై కనబడితే పోలీసులు చితకబాదుడు. మనకు చెబితే ఎక్కడం లేదు, అవగాహన కల్పిస్తే అర్థం అవడం లేదు, విజ్ఞప్తి విన్నపాలు గాలికి వదిలేస్తున్నారు దీంతో చివరి బ్రహ్మాస్త్రం చితకబాదుడు, క్రిమినల్ కేసులు, కనబడితే కాల్చేయడం అయిన మా ఇష్టం మేము ఇంతే అంటే మీకు యమపురి దారులు స్వాగతం పలుకుతాయి మరవొద్దు. కరోనాపై అవగాహన పెంచుకోండి
సామాజిక దూరం పాటించండి.