రోడ్లపై వన్యప్రాణుల స్వేచ్చా విహారం

మహారాష్ట్రలోని యావత్మల్ సమీపంలో ఉన్న తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక పెద్దపులి తన ముగ్గురు పిల్లలతో రోడ్డు దాటుతున్న దృశ్యం స్థానికులను భయం కల్పించిన సంభ్రమాశ్చర్యాల్లో మునిగితేలారు.

అలాగే తిరుమల ఘాట్ రోడ్డులో కూడా పులులు, జింకలు, సర్పాలు సంచరిస్తున్నాయి. ఈ దృశ్యాలను అత్యవసరంగా వెళ్లే వ్యక్తులు ఫోటోలు తీసుకుని ఆనందపడ్డారు.

తెలంగాణలోని అభయరణ్యాల్లో కూడా ముగా జీవులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని అడవుల్లో వన్య ప్రాణులు హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా సంచరిస్తున్నాయి.

కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్ల మీద జనసంచారం, వాహనాల రాకపోకలు తగ్గిన విషయం తెలిసిందే. దీనివల్ల వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గిందని పద్యావరణవేత్తలు అంటున్నారు.

ఈ పరిణామాలతో ఇటు వన్యప్రాణులు కూడా కొంత ఊరడిల్లాయి. గతంలో అవి కోల్పోయిన కొన్ని సహజసిద్ద స్వభావిక లక్షణాలను, స్వేచ్ఛను ఇప్పుడు ప్రదర్శిస్తున్నాయని వన్యప్రాణి సంక్షేమ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణాలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఉన్న పులులు కూడా స్వేచ్ఛగా రోడ్లు దాటుతూ కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక జూపార్కుతో సహా ఇతర అభయరణ్యాలన్నిటిలో కూడా జంతువులు కొంత స్వేచ్ఛగా, సహజంగా, వాటి స్వభావసిద్ధంగా వ్యవహరిస్తున్నాయనీ, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనేది వైల్డ్ లైఫ్ యాక్టివిస్టుల అభిప్రాయం.